హాట్‌కేకుల్లా రైలు టికెట్లు.. 20 నిమిషాల్లోనే ఖాళీ!

  • సాంకేతిక సమస్యల కారణంగా రెండు గంటల ఆలస్యంగా టికెట్ల విక్రయం
  • హౌరా-ఢిల్లీ రైలులోని ఏసీ-1, ఏసీ-3 టికెట్లు పది నిమిషాల్లోనే ఖతం
  • భువనేశ్వర్-ఢిల్లీ టికెట్లు అరగంటలో మాయం
ఎంపిక చేసిన రూట్లలో నేటి నుంచి రైలు సర్వీసులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఐఆర్‌సీటీసీ నిన్న టికెట్ల బుకింగ్ ప్రారంభించింది. సాయంత్రం ఆరు గంటలకు విక్రయాలు ప్రారంభం కాగా 20 నిమిషాల్లోనే టికెట్లు మొత్తం హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. నిజానికి నిన్న సాయంత్రం నాలుగు గంటలకే విక్రయాలు ప్రారంభం కావాల్సి ఉన్నా సాంకేతిక సమస్యల కారణంగా ఆరు గంటలకు మొదలయ్యాయి.

హౌరా-ఢిల్లీ మధ్య నడిచే రైలులోని ఏసీ-1, ఏసీ-3 టికెట్లు కేవలం పది నిమిషాల్లోనే అమ్ముడుపోగా, మిగిలిన అన్ని టికెట్లు 20 నిమిషాల వ్యవధిలోనే అమ్ముడుపోయాయి. భువనేశ్వర్-ఢిల్లీ రైలులోని ఏసీ-1, ఏసీ-3 టికెట్లు అరగంటలోనే అమ్ముడయ్యాయి.

Indian Railways
Rail tickets
Howrah-Delhi

More Telugu News