డిశ్చార్జి అయిన పేషెంట్ల నుంచి కరోనా వ్యాపిస్తున్న దాఖలాలు లేవు: కేంద్రం
- డిశ్చార్జి అయిన వారి నుంచి కరోనా సోకవచ్చని అపోహలు
- అలాంటి కేసులేవీ లేవన్న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
- కొత్త డిశ్చార్జి పాలసీ తీసుకువచ్చిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వం మే 9న కొత్త డిశ్చార్జి పాలసీ తీసుకువచ్చింది. తీవ్ర లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన వారు కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఆర్టీ-పీసీఆర్ టెస్టులో నెగెటివ్ వస్తేనే డిశ్చార్జి అవ్వాల్సి ఉంటుంది. స్వల్ప లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన వారికి మాత్రం డిశ్చార్జి అయ్యేముందు ఎలాంటి టెస్టులు అవసరం లేదని ఆ పాలసీలో పేర్కొన్నారు. సవరించిన డిశ్చార్జి విధానం మరింత సురక్షితమైనదని కేంద్రం పేర్కొంది.