Mamata Banerjee: మోదీతో కాన్ఫరెన్స్ లో తీవ్ర విమర్శలు గుప్పించిన మమతా బెనర్జీ 

Mamata Banerjee criticises centre in Modis video conference
  • రాష్ట్రాల మధ్య కేంద్రం వివక్ష చూపుతోంది
  • మేము సహకరిస్తున్నా.. ఎదురు దాడి చేస్తున్నారు
  • రాజకీయాలకు ఇది సమయం కాదు
కరోనా వైరస్ పై ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. సమావేశం సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. రాష్ట్రాల మధ్య వివక్ష చూపిస్తూ, కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.

ఒక్ స్క్రిప్ట్ ప్రకారం కేంద్రం వ్యవహరిస్తోందని... రాజకీయాలకు ఇది సమయం కాదని మమత అన్నారు. తమ అభిప్రాయాలను ఇంత వరకు ఎవరూ అడగలేదని... ఫెడరల్ వ్యవస్థను కూల్చవద్దని అన్నారు. ఈ సంక్షోభ సమయంలో కేంద్రానికి తాము పూర్తిగా సహకరిస్తున్నామని... అయినా, తమపై ఎదురు దాడి ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఎందుకు ఎప్పూడు బెంగాల్, బెంగాల్, బెంగాల్ అంటూ విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు.
Mamata Banerjee
TMC
Narendra Modi
BJP
Video Conference

More Telugu News