Narendra Modi: ప్రపంచమంతా భారత్ ను పొగుడుతోంది... అందుకు కారణం రాష్ట్రాలే!: సీఎంలతో ప్రధాని మోదీ

PM Modi conducts video conference with Chief Ministers
  • సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్
  • కరోనా గ్రామాలకు విస్తరించకుండా చూడడం సవాల్ అన్న మోదీ
  • భౌతికదూరం పాటించడం ఎంతో ముఖ్యమని వెల్లడి
దేశంలో కరోనా పరిస్థితులు, లాక్ డౌన్ సడలింపులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రులతో మాట్లాడుతూ, కొవిడ్-19 నుంచి భారత్ తనను కాపాడుకున్న తీరు అమోఘమని యావత్ ప్రపంచం భావిస్తోందని, అందుకు రాష్ట్రాల చిత్తశుద్ధే కారణమని అన్నారు.

దేశంలో కరోనా కట్టడిలో రాష్ట్రాలు ప్రధాన భూమిక పోషించాయని తెలిపారు. "ఇవాళ మీరు అందించే సూచనల ఆధారంగానే మన దేశం పయనించాల్సిన దిశను నిర్ణయించుకుందాం. అయితే సడలింపుల నేపథ్యంలో కరోనా మహమ్మారి గ్రామాలకు విస్తరించకుండా చూడడమే మనముందున్న అతి పెద్ద సవాలు. భౌతికదూరం పాటించడాన్ని ఎప్పుడు విస్మరిస్తామో అప్పుడే మన సమస్యలు మరింతగా పెరుగుతాయి" అని మోదీ వ్యాఖ్యలు చేశారు.

అంతేకాకుండా, ఎక్కడివారు అక్కడ ఉంటేనే కరోనా మహమ్మారి వ్యాప్తి కట్టడి చేయగలమని భావించామని, కానీ, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఇంటికి చేరుకోవాలనుకోవడం అనేది మానవ స్వాభావిక లక్షణం అని, వలస కార్మికుల పరిస్థితి కూడా అలాంటిదేనని అభిప్రాయపడ్డారు.
Narendra Modi
Chief Ministers
Video Conference
Lockdown
Corona Virus
India

More Telugu News