Jammu And Kashmir: జమ్మూకశ్మీర్ లో 4జీ సేవలను ప్రారంభించాలన్న విన్నపాన్ని తిరస్కరించిన సుప్రీంకోర్టు

SC refuses to restore 4G internet in Jammu and Kashmir
  • అత్యున్నత స్థాయి కమిటీ వేయాలని ఆదేశం
  • పిటిషనర్ల అంశాలను కూడా సమీక్షించాలని సూచన
  • క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై సమీక్ష నిర్వహించాలని ఆదేశం
జమ్మూకశ్మీర్ లో 4జీ ఇంటర్నెట్ సేవలను పునఃప్రారంభించాలన్న విన్నపాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇదే సమయంలో కేంద్ర హోం శాఖ, జమ్మూకశ్మీర్ అధికార యంత్రాంగానికి కీలక సూచన చేసింది. క్షేత్ర స్థాయిలో నెలకొన్న పరిస్థితులపై సమీక్ష నిర్వహించేందుకు అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఈ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పింది. పిటిషనర్లు పేర్కొన్న అంశాలను కూడా ఈ కమిటీ పరిగణనలోకి తీసుకుని సమీక్ష నిర్వహించాలని తెలిపింది.

గత నెల 29న జమ్మూకశ్మీర్ అధికార యత్రాంగం సుప్రీంకోర్టుకు తన వాదనలను వినిపిస్తూ... ఇంటర్నెట్ సేవలను పొందడం ప్రాథమిక హక్కు కిందకు రాదని తెలిపింది. దేశ రక్షణ కోసం, సార్వభౌమాధికారాన్ని కాపాడటం కోసం ఇంటర్నెట్ వేగాన్ని తగ్గించామని చెప్పింది.
Jammu And Kashmir
4G
Supreme Court

More Telugu News