Anasuya: హిందీ సీరియల్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న అనసూయ!

Anchor Anasuya gets Bollywood chance
  • ఓ టాప్ రేటెడ్ హిందీ సీరియల్ లో అనసూయకు అవకాశం
  • ఇప్పటికే ఆమెను సంప్రదించిన మేకర్స్
  • ప్రస్తుతం తెలుగులో పుల్ బిజీగా ఉన్న అనసూయ
తెలుగు హాట్ యాంకర్ గా గుర్తింపు పొందిన అనసూయ... బిజీగా దూసుకుపోతోంది. ఇటు బుల్లితెర, అటు వెండితెర... రెండు రంగాల్లో విజయవంతంగా రాణిస్తూ, బిజీబిజీగా గడిపేస్తోంది. తెలుగు సినీ ప్రేక్షకుల్లో ఆమెకున్న ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. ఇప్పటివరకు టాలీవుడ్ కే పరిమితమైన అనసూయ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టేందుకు రంగం సిద్ధమైంది. అయితే సినిమాలో కాదు, సీరియల్ అని తెలుస్తోంది.

హిందీ సీరియల్స్ కు దేశ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంటుంది. పాకిస్థాన్, బంగ్లాదేశ్ లో కూడా హిందీ సీరియల్స్ ను విపరీతంగా చూస్తారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే హిందీలో ఓ టాప్ రేటెడ్ సీరియల్ లో ఓ కీలక పాత్ర కోసం అనసూయను మేకర్స్ సంప్రదించారట. ఇదే నిజమైతే.. అనసూయ స్థాయి మరో రేంజ్ కు చేరుకున్నట్టే.
Anasuya
Actor
Anchor
Tollywood
Bollywood

More Telugu News