అస్వస్థతతో ఎయిమ్స్‌లో చేరిన మన్మోహన్ సింగ్.. త్వరగా కోలుకోవాలంటూ నేతల ఆకాంక్ష!
- జ్వరం, చాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరిక
- ప్రస్తుతం నిలకడగానే ఆరోగ్యం
- త్వరగా కోలుకోవాలంటూ నేతల ట్వీట్లు
మన్మోహన్‌సింగ్ త్వరగా కోలుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆకాంక్షించారు. మన్మోహన్ త్వరగా కోలుకోవాలని తనతో సహా కోట్లాదిమంది భారతీయులు కోలుకుంటున్నారని కర్ణాటక కాంగ్రెస్ పార్టీ చీఫ్ డీకే శివకుమార్ అన్నారు. ఆ పార్టీ సీనియర్ నేత శశిథరూర్, ఒమర్ అబ్దుల్లాలు కూడా మన్మోహన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన ఆసుపత్రిలో చేరారన్న వార్త బాధాకరమని, ఆయన త్వరగా కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఆయన మార్గదర్శనం దేశానికి అవసరమని అన్నారు. శివసేన నేత ఆదిత్య థాకరే, ఎన్సీపీ నేత, బారామతి ఎంపీ సుప్రియ సూలే తదితరులు కూడా మాజీ ప్రధాని త్వరగా కోలుకుని ఇల్లు చేరాలని ఆకాంక్షించారు.