Ajit Jogi: మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి ఆరోగ్య పరిస్థితి విషమం

చత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యారు. ఆ సమయంలో ఆయన తన ఇంటి వద్దే ఉన్నారు. ఆయనను వెంటనే రాయ్ పూర్ లోని శ్రీ నారాయణ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనను వెంటిలేటర్ పై ఉంచి వైద్యం అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు. అజిత్ జోగి పరిస్థితి క్రిటికల్ గా ఉందనే వార్తతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Ajit Jogi
Chhattisgarh
Former CM
Cardiac Arrest
Ill

More Telugu News