వెబ్ సిరీస్ వైపుకు సీనియర్ వంశీ!
- దర్శకుడిగా వంశీకి మంచి పేరు
- ప్రకృతికి ప్రాధాన్యతనిచ్చే వంశీ
- 'పొలమారిన జ్ఞాపకాలు'కు దృశ్య రూపం
అలాంటి వంశీ కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన కూడా వెబ్ సిరీస్ ల దిశగా అడుగులు వేస్తున్నారనేది తాజా సమాచారం. ఇంతకుముందు వంశీ తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల సమాహారాన్ని 'పొలమారిన జ్ఞాపకాలు'గా రాశారు. వాటిని వెబ్ సిరీస్ గా అందించడానికి సన్నాహాలు మొదలైనట్టుగా చెబుతున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ వారు వంశీకి భారీ ఆఫర్ ఇవ్వడంతో ఆయన రంగంలోకి దిగినట్టుగా చెబుతున్నారు. లాక్ డౌన్ తరువాత ఈ వెబ్ సిరీస్ నిర్మాణం మొదలవుతుందని అంటున్నారు.