నన్ను చూడగానే చిరంజీవిగారు కారు దిగి మరీ వచ్చారు: హైపర్ ఆది
- చిరంజీవి గారిని దగ్గరగా చూశాను
- ఆయన చూపిన అభిమానం మరువలేనిది
- టీవీ రంగాన్ని ఎప్పటికీ వదిలేయనన్న ఆది
'జబర్దస్త్' చేస్తున్న సమయంలోనే ఒకసారి నేను అన్నపూర్ణ స్టూడియోకి వెళ్లాను. అక్కడ చిరంజీవిగారు తన షూటింగును పూర్తి చేసి బయలుదేరుతున్నారు. ఆయనను దగ్గరగా చూడాలనే ఉద్దేశంతో ఓ సాధారణమైన అభిమానిగానే నేను ఆయన కారుకు దగ్గరగా నిలబడ్డాను. కార్లో కూర్చున్న తరువాత ఆయన నన్ను చూశారు. నన్ను చూసిన వెంటనే కారు దిగేసి వచ్చి ఆత్మీయంగా దగ్గరికి తీసుకున్నారు. 'మీ స్కిట్లు చూస్తుంటాను .. చాలా బాగుంటాయి .. మీ పంచ్ లు బాగా నవ్విస్తాయి' అంటూ ఆయన నా పనితీరును ప్రశంసించారు. అంతటి గొప్ప నటుడు అంతలా నాతో మాట్లాడడం నా జీవితంలో నేను ఎప్పటికీ మరిచిపోలేని సంఘటనగా భావిస్తుంటాను. నాకు ఇంతటి గుర్తింపును తీసుకొచ్చిన టీవీ రంగాన్ని నేను ఎప్పటికీ వదిలేయను ' అని చెప్పుకొచ్చాడు.