1985 నాటి భారత జట్టు ఇప్పటి కోహ్లీ సేనను దీటుగా ఎదుర్కోగలదు: రవిశాస్త్రి
- 1985లో వరల్డ్ చాంపియన్ షిప్ నెగ్గిన భారత్
- నాడు రవిశాస్త్రికి మ్యాన్ ఆఫ్ ద సిరీస్
- వైట్ బాల్ క్రికెట్లో ఏ జట్టుకైనా '85' జట్టుతో కష్టాలు తప్పవన్న శాస్త్రి
అంతేకాదు, కపిల్ దేవ్ నాయకత్వంలో తొలిసారి వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టు కంటే 1985 నాటి భారత జట్టే బలమైనదని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. తాను ఆ రెండు జట్లలో ఉన్నానని, 83లో ఆడిన కీలక ఆటగాళ్లు 85 నాటి జట్టులో ఉన్నా, కొందరు యువ ఆటగాళ్ల రాకతో జట్టు మరింత బలోపేతం అయిందని వివరించాడు. లక్ష్మణ్ శివరామకృష్ణన్, సదానంద్ విశ్వనాథ్, మహ్మద్ అజహరుద్దీన్ వంటి కుర్రాళ్లతో జట్టు దృఢంగా మారిందని తెలిపాడు.