నవ్వుల్లో ముంచెత్తుతున్న అభినయం.. డేవిడ్‌ వార్నర్‌ పోస్ట్ చేసిన మరో వీడియో వైరల్!

david warner tiktok dancing
  • విలియమ్సన్‌, భువనేశ్వర్‌తో డ్యాన్స్‌
  • గతంలో తీసిన ఫన్నీ వీడియో పోస్ట్
  • ఈ దృశ్యాలు నవ్వుల్లో ముంచెత్తాయని వ్యాఖ్య
టిక్‌టాక్‌ వీడియోలతో అభిమానులను అలరిస్తోన్న ఆస్ట్రేలియా క్రికెటర్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ తాజాగా మరో వీడియో వదిలాడు. ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో కూడా బాగా వైరల్ అవుతోంది. గత ఐపీఎల్‌ సీజన్‌లో‌ సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు భువనేశ్వర్‌ కుమార్‌, కేన్‌ విలియమ్సన్‌లతో తాను చేసిన హంగామా ఎలా ఉందో ఇందులో ఆయన చూపించాడు.‌

‘వాట్‌ ఈజ్‌ లవ్‌’ ప్లే పాట వస్తుండగా వారంతా డ్యాన్స్ వేస్తున్నట్లు చేతులు, కాళ్లు ఆడించారు. తమ సీట్లలోనే కూర్చొని వారు డ్యాన్స్‌ చేయడం ఫన్నీగా ఉంది. విలియమ్సన్‌, భువనేశ్వర్‌ కారు డ్రైవింగ్‌ చేస్తున్నట్లు కనపడ్డారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన వార్నర్‌.. తనను ఈ దృశ్యాలు నవ్వుల్లో ముంచెత్తాయని చెప్పాడు. ఇటీవల  భార్య క్యాండీస్‌తో కలిసి వార్నర్ బుట్టబొమ్మ  పాటకు వేసిన స్టెప్పులు తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే.

 

Go Back to Shorts
david warner
Viral Videos
Cricket

More Telugu News