పెళ్లి కోసం 13 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన న్యాయవాది అరెస్ట్
- తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఘటన
- కిడ్నాప్‌కు సహకరించిన నిందితుడి తల్లి, అత్త
- అందరిపైనా పోక్సో చట్టం కింద కేసు నమోదు
ఈ సందర్భంగా న్యాయవాది కరుపయ్యే బాలికను కిడ్నాప్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. అతడికి వివాహమైనా ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. బాలిక కిడ్నాప్‌కు న్యాయవాది తల్లి, అత్త, మరో వ్యక్తి అతడికి సహకరించినట్టు గుర్తించిన పోలీసులు వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు కరుపయ్యను అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న మిగతా వారి కోసం గాలిస్తున్నారు.