ఫ్రంట్ లైన్ వారియర్స్ కి పుష్పాభివందనం చేయడం అభినందనీయం: హీరో చిరంజీవి
- దేశాన్ని కాపాడేది వీర సైనికులు
- ‘కరోనా’ కట్టడికి పోరాడుతోంది ఫ్రంట్ లైన్ వారియర్స్
- వీళ్లిద్దరికి మనం రుణపడి ఉన్నామంటూ చిరంజీవి ట్వీట్
సరిహద్దులు దాటి వచ్చే ఉగ్రవాదులపై పోరాడి దేశాన్ని కాపాడే వీర సైనికులు, కనిపించని వైరస్ అందరిపై దాడి చేస్తుంటే, అహర్నిశలు మనల్ని కాపాడేందుకు తమ ప్రాణాలు పణంగా పెట్టి ముందు వరుసలో ఉండి పోరాడుతున్న యోథులకు పుష్పాభివందనం చేయడం అభినందనీయమని ప్రశంసించారు. కరోనా పై పోరాడుతున్న వారికి, వీర సైనికులకు తాము రుణపడి ఉన్నామని ప్రశంసిస్తూ చిరంజీవి ఓ ట్వీట్ చేశారు.