'పులుసు' ఆట ఆడిన రకుల్ ప్రీత్ సింగ్... వైరల్ వీడియో ఇదిగో!
- లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమైన రకుల్
- తమ్ముడు అమన్ తో కలిసి ఆటలు
- బాల్యం గుర్తు చేసుకున్నానని వ్యాఖ్య
తాను చేసిన యోగా వీడియోలను, సరదాగా చేసిన వీడియోలను ఇప్పటికే పోస్ట్ చేసిన రకుల్, తాజాగా, పలు రకాల ఆటలను ఆడుతున్న వీడియోను పెట్టగా, అదిప్పుడు వైరల్ అవుతోంది. అమన్ తో కలిసి 'దిండూ - దెబ్బ', 'కబడ్డీ', 'పులుసు' ఆటలు ఆడింది. ఇక ఈ ఆటలను చిన్నప్పుడు ఆడుకున్నానని, ఇప్పుడు వాటన్నింటినీ గుర్తు చేసుకున్నానని, ఇటువంటి సమయం ఎవరినైనా బాల్యంలోకి తీసుకెళ్తుందని వ్యాఖ్యానించింది. ఎంతో ఆకట్టుకుంటున్న ఈ వీడియోను మీరూ చూడవచ్చు.