నాకు కరోనా రాలేదు... మలేరియా మాత్రమే: హీరోయిన్ పాయల్ ఘోష్
- ఇటీవల అనారోగ్యంతో బాధపడిన పాయల్ ఘోష్
- కరోనా సోకిందని గుప్పుమన్న వార్తలు
- తాజాగా వివరణ ఇచ్చిన పాయల్ ఘోష్
"గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నా. తొలుత తలనొప్పి, ఆపై జ్వరం వచ్చాయి. నాకు సోకింది కరోనా కాదని నాకు కచ్చితంగా తెలుసు. ఎందుకంటే నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను కాబట్టి. ఇదే సమయంలో నా బంధుమిత్రులు మాత్రం ఆందోళనకు గురయ్యారు. దీంతో హాస్పిటల్ కు వెళ్లి టెస్ట్ లు చేయించుకోగా, మలేరియా ఫీవర్ వచ్చినట్టు తేలింది. ప్రస్తుతం కోలుకుంటున్నాను. ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ త్వరలోనే పూర్తి నియంత్రణలోకి వస్తుందని బలంగా నమ్ముతున్నాను. త్వరలోనే మనం సాధారణ జీవితాన్ని తిరిగి ప్రారంభిస్తామని భావిస్తున్నాను" అని వ్యాఖ్యానించింది.