భారత్ లో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి... 24 గంటల్లో 1823 కొత్త కేసులు

  • ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 33,610
  • 24 గంటల వ్యవధిలో 67 మంది మృతి
  • చికిత్స పొందుతున్న వారి సంఖ్య 24,162
దేశంలో కరోనా రక్కసి విలయం కొనసాగుతోంది. అనేక రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 1823 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దాంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 33,610కి చేరింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 24,162గా నమోదైంది. 8,373 మంది డిశ్చార్జి అయ్యారు.

24 గంటల వ్యవధిలో 67 మంది మృత్యువాత పడగా, మొత్తం మరణాల సంఖ్య 1075కి పెరిగింది. గడచిన 24 గంటల్లో 576 మంది డిశ్చార్జి కావడం కాస్తంత ఊరట కలిగించే విషయం. ఇక రాష్ట్రాల విషయానికొస్తే, ఏపీలో పరిస్థితి ఆందోళన కలిగిస్తుండగా, తెలంగాణలో మాత్రం అదుపులోనే ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.

India
Corona Virus
New Cases
Positive Cases
Deaths

More Telugu News