నితిన్ జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్
- హిందీలో హిట్ కొట్టిన 'అంధాదున్'
- జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్
- క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేసే ఛాన్స్
తెలుగు రీమేక్ రైట్స్ ను నితిన్ దక్కించుకున్నాడు. హిందీలో 'టబు' చేసిన పాత్రకిగాను రాధికా ఆప్టే ను ఎంపిక చేసుకున్నారు. ఇక కథానాయిక పాత్రకి గాను ప్రియాంక అరుళ్ మోహన్ ను తీసుకున్నారనేది తాజా సమాచారం. జూన్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెడతారట. క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ సినిమాతో ఇక్కడ ప్రియాంక అరుళ్ మోహన్ కెరియర్ ఊపందుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి.