ఢిల్లీలోని నీతి ఆయోగ్ అధికారికి ‘కరోనా’ పాజిటివ్!
- డైరెక్టర్ స్థాయి అధికారికి ‘కరోనా’పాజిటివ్
- ఆయనతో కాంటాక్టులో వున్న వారికి క్వారంటైన్
- 48 గంటల పాటు కార్యాలయం మూసివేత
నిబంధనల మేరకు ఈ సమాచారాన్ని ఆరోగ్య మంత్రిత్వ శాఖకు తెలియజేశామని అలోక్ కుమార్ వివరించారు. ఆ అధికారితో కాంటాక్టులో ఉన్న ప్రతి ఒక్కరినీ హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ కార్యాలయంలో కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని, 48 గంటల పాటు కార్యాలయాన్ని మూసివేస్తున్నట్టు పేర్కొన్నారు.