ఇవాళ రెండు కేసులే... తెలంగాణలో అదుపులోకి వస్తున్న కరోనా!

Only two corona cases today in Telangana
  • ఆ రెండు కేసులూ జీహెచ్ఎంసీ పరిధిలోనే!
  • తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 1003
  • ఇవాళ 16 మంది డిశ్చార్జి
తెలంగాణలో ఇవాళ రెండు కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే వెల్లడయ్యాయి. అవి రెండు కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనివేనని ప్రభుత్వం తన బులెటిన్ లో పేర్కొంది. ఈ రెండు కేసులతో కలిపి రాష్ట్రం మొత్తమ్మీద 1003 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 25 కాగా, 332 మంది డిశ్చార్జి అయ్యారు. ఇవాళ ఒక్కరోజే 16 మందిని డిశ్చార్జి చేశారు. ప్రస్తుతానికి 646 యాక్టివ్ కేసులున్నట్టు తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య విభాగం పేర్కొంది. కాగా, తెలంగాణలోని సగం కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 556 మందికి పాజిటివ్ గా నిర్ధారణ కాగా 18 మంది చనిపోయారు. జీహెచ్ఎంసీ తర్వాత సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా 83 కేసులు నమోదయ్యాయి.
Go Back to Shorts
Telangana
Corona Virus
Positive Cases
COVID-19

More Telugu News