'రెండు గజాల దూరం' మనకు శ్రీరామరక్ష: నరేంద్ర మోదీ
- భారత ఆర్థిక వ్యవస్థ బాగుంది
- లాక్ డౌన్ కారణంగా వేలాది ప్రాణాలు నిలిచాయి
- రెడ్ జోన్లను ఆరంజ్ జోన్లుగా చేసేందుకు కృషి
సొంతంగా వాహనాలను కలిగివున్న వారు కొన్ని నియమాలను పాటిస్తూ, తిరిగేందుకు అనుమతించి, బస్సులు సహా రైళ్లు, విమానాల నిషేధం కొనసాగుతుందని కూడా మోదీ సూచనప్రాయంగా తెలిపారు. ప్రజల్లో ఉన్న లాక్ డౌన్ మైండ్ సెట్ అలాగే ఉండాలి. భౌతిక దూరాన్ని పాటించడంలో కొత్త నిబంధనలు తీసుకుని వచ్చేలా మోదీ నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నామని మేఘాలయ ముఖ్యమంత్రి కొన్ రాడ్ సంగ్మా ఆశాభావం వ్యక్తం చేశారు.