వ్యాక్సిన్ రాకపై: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అలా.. బ్రిటన్ మంత్రి ఇలా!
- కరోనా వ్యాక్సిన్ తయారీలో ప్రపంచం బిజీ
- సెప్టెంబరు నాటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్న యూనివర్సిటీ
- ఈ ఏడాది కష్టమేనన్న డొమినిక్ రాబ్
వ్యాక్సిన్ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్న ఆయన.. ఈ ఏడాది వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం కష్టమేనన్నారు. ఇటీవల ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఓ మహిళపై వ్యాక్సిన్ ప్రయోగించారు. ప్రస్తుతం ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో డొమినిక్ ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది. సెప్టెంబరు నాటికే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని, డిసెంబరు నాటికి దానిని ప్రపంచానికి పరిచయం చేస్తామని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఇటీవలే ప్రకటన చేసింది. అందుకు విరుద్ధంగా ఇప్పుడు మంత్రి ప్రకటించడం చర్చనీయాంశమైంది.