కలియుగదైవం ఆ పరిస్థితి రానీయడని భావిస్తున్నా: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
- టీటీడీ ఫిక్స్ డ్ డిపాజిట్లు బయటకు తీసే ప్రసక్తే లేదు
- ఆ పరిస్థితి రాకుండా చర్యలు కూడా తీసుకుంటాం
- సాధారణ పరిస్థితులు రావాలని కోరుకుంటున్నా
‘కరోనా’ మహమ్మారి నుంచి త్వరలోనే బయటపడి సాధారణ పరిస్థితులు రావాలని కోరుకుంటున్నానని అన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో పనులు లేని వలస కార్మికులకు, నిరాశ్రయులకు, యాచకులకు ఎటువంటి ఇబ్బంది పడకుండా రోజూ రెండు పూట్ల భోజనం పెడుతున్నామని, సుమారు 65 నుంచి 70 వేల మందికి అన్నప్రసాదం అందజేశామని అన్నారు.