Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జగన్ ది సున్నా పరిపాలన: టీడీపీ నేత యనమల

Yanamala Ramakrishnudu criticises AP CM Jagan
  • జగన్ పాలనలో సున్నా వడ్డీ లేదు
  • 45 ఏళ్లకే పింఛన్ ఇస్తానన్న హామీని అమలు చేయట్లేదు
  • ఇచ్చిన హామీలను జగన్ గాలికొదిలేశారు
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. జగన్ ది సున్నా వడ్డీ కాదు, సున్నా పరిపాలన అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 45 ఏళ్లకే పింఛన్ ఇస్తానన్న హామీని జగన్ గాలికొదిలేశారని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో సున్నా వడ్డీ పథకం అమలు చేశామని గుర్తుచేశారు.
Yanamala
Telugudesam
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News