మా సంసారంలో నిప్పులు పోయద్దు చిరంజీవి గారూ!: పీవీపీ జోక్ వైరల్
- 'బీ ద రియల్ మేన్' కు టాలీవుడ్ నటుల స్పందన
- ఇంటిపనులైతే ఓకేగానీ, మీలా మేము నలభీములం కాదు
- మెగాస్టార్ చేయగాలేనిది మీకేమైందని అంటున్నారు
- ట్విట్టర్ లో పీవీపీ ఆసక్తికర పోస్ట్
ఇల్లును శుభ్రం చేసిన తరువాత, చిరంజీవి స్వయంగా ఓ దోశను బ్రహ్మాండంగా వేసి, తన తల్లికి తినిపిస్తూ, అందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేయడంపై నిర్మాత, వైసీపీ నేత పీవీపీ స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టగా అదిప్పుడు వైరల్ అవుతోంది.
"చిరంజీవి గారు, ఏదో ఇంట్లో అంట్లు తోమగలము, గచ్చు కడగగలము కానీ మీరిలా స్టార్ చెఫ్ లా నలభీమ పాకము వండుతుంటే, మా ఆవిడ మెగాస్టారే చేయగలేనిది, మీకేమిటి అంటున్నారు.. మా సంసారంలో నిప్పులు పోయొద్దు రియల్ లైఫ్ మెగాస్టార్‌గారు.. జోక్స్ పక్కన పెడితే.. మీ ప్రేరణ ప్రశంసనీయం సర్" అంటూ పీవీపీ ట్వీట్ చేశారు.