లాక్డౌన్ ఎఫెక్ట్: హైదరాబాద్లో గృహ విక్రయాల్లో భారీ క్షీణత
- జనవరి-మార్చి త్రైమాసికంలో 39 శాతం తగ్గిన విక్రయాలు
- ఏప్రిల్-జూన్ త్రైమాసికంలోనూ ఇదే కొనసాగే అవకాశం
- వెల్లడించిన ప్రోప్ టైగర్ నివేదిక
అలాగే, గతేడాది జనవరి-మార్చి మధ్య 72,932 కొత్త ఫ్లాట్లు అందుబాటులోకి రాగా, ఈసారి అదే సమయంలో 35,668 ఫ్లాట్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. గృహ అమ్మకాలపై కరోనా వైరస్ ప్రతికూల ప్రభావం బాగా కనిపించిందని ప్రోప్ టైగర్ గ్రూప్ సీఈవో ధ్రువ్ అగర్వాల్ తెలిపారు. అయితే, ఈ ప్రభావం ఒక్క స్థిరాస్తి రంగంపైనే లేదని, దాదాపు అన్ని రంగాలు ప్రభావితమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలోనూ ఈ క్షీణత కొనసాగే అవకాశం ఉందన్నారు.