Varla Ramaiah: విజయ సాయిరెడ్డిని మీ సామంత రాజుగా నియమించారా? బొంగరంలా తిరుగుతున్నారు: వర్ల రామయ్య చురకలు

varla ramiah mocks on jagan
  • సీఎం జగన్‌కి వర్ల ప్రశ్న
  • విశాఖ జిల్లాలో అంతాతానై విజయసాయిరెడ్డి తిరుగుతున్నారు
  • లాక్ డౌన్ లెక్కచేయకుండా వ్యవహరిస్తున్నారు
  • ఏ2ను కట్టడి చేయండి 
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ నేపథ్యంలో వైసీపీ నేతల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ అమలులో ఉన్న సమయంలోనే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పలు ప్రాంతాల్లో పర్యటిస్తుండడం పట్ల టీడీపీ నేత వర్ల రామయ్య అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.

'ముఖ్య మంత్రి గారు.. విశాఖ జిల్లాలో అంతాతానై, లాక్ డౌన్ కూడ లెక్కచేయకుండా వ్యవహరిస్తున్న విజయ సాయిరెడ్డిని మీ సామంత రాజుగా నియమించారా? తాను కేవలం రాజ్యసభ సభ్యుడన్న సంగతి మరచి, మంత్రులను కాదని  బొంగరంలా తిరుగుతున్న ఏ2ను కట్టడి చేయండి. ఆయన బయట తిరిగితే పోలీసులు కూడా లాటీలు ఝుళిపించాలి' అని వర్ల రామయ్య ఎద్దేవా చేశారు.
Varla Ramaiah
Telugudesam
Vijayasai Reddy
Lockdown

More Telugu News