Viral Videos: పోలీసులు, కూరగాయలమ్మే వ్యక్తుల మధ్య ఘర్షణ.. పరస్పర దాడులు.. మీడియాకు చిక్కిన దృశ్యాలు

A clash broke out between Police  a group of people in the city today
  • యూపీలో ఘటన
  • గొడవపడ్డ కూరగాయల వ్యాపారులు
  • మధ్యలో వచ్చిన పోలీసులపై రాళ్ల వర్షం
కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి విధించిన లాక్‌డౌన్‌తో దేశ వ్యాప్తంగా పలు చోట్ల పోలీసులతో స్థానికులు ఘర్షణకు దిగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో పోలీసులు, స్థానికంగా కూరగాయలు అమ్మే వ్యక్తులకు మధ్య ఈ రోజు తీవ్ర ఘర్షణ జరిగింది.

ఇందుకు సంబంధించిన వీడియో మీడియాకు దొరికింది. ఈ రోజు ఉదయం ఆ ప్రాంతంలో కూరగాయలు అమ్మే చిరు వ్యాపారులు గొడవపడ్డారు. ఈ విషయం తెలుసుకుని పోలీసులు ఆ ప్రాంతంలోకి అడుగుపెట్టగానే ఆ వ్యాపారులంతా కలిసి పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు.

దీంతో పోలీసులు వారిపై విరుచుకుపడ్డారు. దీంతో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. పలు షాపులు ధ్వంసమయ్యాయి. పోలీసులు, కూరగాయలు అమ్మే వ్యక్తులు పరస్పరం దుర్భాషలాడుకున్నారు.
Viral Videos
India
Police
Lockdown

More Telugu News