తమిళంలో రీమేక్ దిశగా 'ఉప్పెన'!
- నాయకా నాయికలకు తొలి చిత్రంగా 'ఉప్పెన'
- దర్శకుడు బుచ్చిబాబుకి తొలి ప్రయత్నం
- విజయ్ సేతుపతి చేతికి తమిళ రీమేక్ హక్కులు
ఇప్పటికే తెలుగులో విడుదల కావలసిన ఈ సినిమా, లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించారు. తమిళంలో ఈ సినిమాను రీమేక్ చేయాలని నిర్ణయించుకున్న విజయ్ సేతుపతి, మైత్రి వారి నుంచి రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేశాడట. నిర్మాణ భాగస్వాములుగా మైత్రి వారు ఉంటారని అంటున్నారు. తెలుగులో విజయ్ సేతుపతి చేసిన పాత్రను, అక్కడ ఆయనే చేస్తాడని సమాచారం. ఇక నాయకా నాయికలుగా ఎవరిని తీసుకుంటారనేది త్వరలోనే తెలియనుంది.