'పుష్ప'లో నా పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది: రష్మిక
- 'పుష్ప' సినిమాలో కొత్తగా కనిపిస్తాను
- పూర్తి వైవిధ్యభరితమైన పాత్ర ఇది
- ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందన్న రష్మిక
తాజాగా ఈ సినిమాను గురించి రష్మిక మాట్లాడుతూ .. 'పుష్ప' సినిమాలో నా పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది .. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. ఈ పాత్రలో నేను చాలా కొత్తగా కనిపిస్తాను. నటన పరంగా నాలోని మరో కోణాన్ని ఆవిష్కరించే విధంగా ఈ పాత్ర ఉంటుంది. ఇంత త్వరగా ఇంతటి వైవిధ్యభరితమైన పాత్రను చేస్తానని నేను అసలు ఊహించలేదు. నా కెరియర్లో చెప్పుకోదగిన పాత్రగా నిలిచిపోతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు" అని చెప్పుకొచ్చింది.