'పుష్ప'లో మరో లుక్ తోను కనిపించనున్న బన్నీ
- అడవి నేపథ్యంలో సాగే కథ
- లారీ డ్రైవర్ పాత్రలో బన్నీ
- మాఫియా డాన్ గా మరో లుక్
సినిమా మొత్తం అల్లు అర్జున్ ఇదే లుక్ తో కనిపిస్తాడని అనుకున్నారు. కానీ స్టైలీష్ మాఫియా డాన్ గా ఆయన మరో లుక్ తోను కనిపించనున్నాడనేది తాజా సమాచారం. ఈ సినిమాలో కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందట. ఆ ఎపిసోడ్ లో బన్నీ మాఫియా డాన్ గా కనిపిస్తాడని చెబుతున్నారు. ఆ లుక్ కి సంబంధించిన ఫొటో షూట్ ను ప్లాన్ చేస్తున్నారట. కొత్తగా బయటికి వచ్చిన ఈ వార్త ఇప్పుడు ఈ సినిమా మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.