పాజిటివ్ లన్నీ నెగటివ్... కరోనా నుంచి బయటపడిన తొలి రాష్ట్రంగా గోవా!
- గోవాలో సున్నాకు చేరిన పాజిటివ్ ల సంఖ్య
- డాక్టర్లకు, హెల్త్ వర్కర్లకు రుణపడివుంటాం
- ట్విట్టర్ లో వెల్లడించిన గోవా ఆరోగ్య మంత్రి
లాక్ డౌన్ ఎంత ముఖ్యమో గుర్తుంచుకుని, అందుకు తగ్గట్టుగా నిబంధనలు పాటిస్తూ, ప్రజా జీవితాన్ని ముందుకు తీసుకువెళతామని అన్నారు. సామాజిక దూరాన్ని ప్రజలు పాటించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన గైడ్ లైన్స్ ను పాటించాలని పిలుపునిచ్చారు. గోవాను కరోనా రహిత రాష్ట్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ం చీఫ్ సెక్రటరీ పరిమల్ రాయ్, ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీమతి నీలా మోహనన్ తదితరులు చేస్తున్న కృషి ఫలించిందని అన్నారు.