రాజకీయ పరిణతి కనిపిస్తోందంటూ రాహుల్ గాంధీని ప్రశంసించిన శివసేన
- కరోనా నేపథ్యంలో విభేదాలు పక్కనపెట్టాలని రాహుల్ నిర్ణయం
- ఐక్యంగా పనిచేయాలంటూ పిలుపు
- రాహుల్ నిర్ణయాన్ని కొనియాడిన శివసేన
- 'సామ్నా' పత్రికలో సంపాదకీయం
"తనకు ప్రధాని మోదీతో విభేదాలు ఉన్నా ఇది వాదులాడుకునే తరుణం కాదని, అందరూ ఐక్యంగా పోరాడాలని రాహుల్ పిలుపునిచ్చారు. రాహుల్ పైనా, మోదీ, అమిత్ షాలపైనా భిన్న వాదనలు ఉన్నాయి. అయితే, బీజేపీ సక్సెస్ లో సగభాగం రాహుల్ గాంధీ ఇమేజిని దెబ్బతీసే క్రమంలోనే సాధ్యమైంది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. కానీ రాహుల్ మాత్రం క్రమశిక్షణకు కట్టుబడి, వివాదాల జోలికి పోకుండా ఓ ఆదర్శప్రాయుడిలా నిలిచారు" అంటూ శివసేన కీర్తించింది.