మహేశ్ బాబు మూవీలో శ్రద్ధా కపూర్?
- పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ బాబు
- పాన్ ఇండియా మూవీగా మార్చే ఆలోచన
- 'సాహో' తరువాత శ్రద్ధా కపూర్ కి ఛాన్స్?
ఈ క్రమంలో కీర్తి సురేశ్ తో పాటు కొంతమంది కథానాయికల పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా శ్రద్ధా కపూర్ పేరు తెరపైకి వచ్చింది. బాలీవుడ్ లో శ్రద్ధా కపూర్ కి మంచి క్రేజ్ వుంది. తెలుగులో ఆమె ప్రభాస్ సరసన 'సాహో' సినిమా చేసింది. ఆ సినిమా ఇక్కడ ఆశించిన స్థాయి వసూళ్లను రాబట్టలేదు. ఆ తరువాత ఆమె తెలుగు సినిమాలకి సైన్ చేయలేదు. పరశురామ్ తో మహేశ్ బాబు చేయనున్న సినిమా కూడా పాన్ ఇండియా మూవీగానే రూపొందిస్తారట. అందువలన బాలీవుడ్ నుంచి శ్రద్ధా కపూర్ ను తీసుకునే దిశగా సంప్రదింపులు జరుగుతున్నాయని అంటున్నారు.