Andhra Pradesh: ఏపీలో 24 గంటల్లో మరో 38 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ

coronavirus cases in ap
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల్లో జరిగిన కొవిడ్-19 పరీక్షల్లో కొత్తగా మరో 38 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఏపీ ప్రభుత్వం ప్రకటన చేసింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 572 పాజిటివ్ కేసులకు గాను 35 మంది డిశ్చార్జ్ కాగా, 14 మంది మరణించారని తెలిపింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 523 అని పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, గుంటూరు జిల్లాల్లో అత్యధికంగా 126 చొప్పున కేసులు నమోదయ్యాయని ఏపీ సర్కారు చెప్పింది. గుంటూరులో 122 మంది ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటుండగా, నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కర్నూలులో 124 మంది ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటుండగా ఇద్దరు మృతి చెందారు.

ఈ రెండు జిల్లాల తర్వాత అత్యధికంగా నెల్లూరులో 64 కేసులు నమోదు కాగా 61 మందికి చికిత్స అందుతోంది. ఒకరు డిశ్చార్జ్‌ కాగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

ఏయే జిల్లాల్లో ఎన్ని కేసులు..?                                
                                          
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
COVID-19

More Telugu News