పని లేదు, ఆర్థికంగా దెబ్బతిన్నాం.. జీవితం మారిపోయింది: వాపోయిన హీరోయిన్ పాయల్ ఘోష్
- ఇటువంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు
- ఎవరి జీవితమూ పూల పాన్పులా లేదు
- పరిస్థితి అనుకూలంగా లేదన్న 'ప్రయాణం' హీరోయిన్
ఇక, లాక్ డౌన్ కారణంగా తనకు పని లేకుండా పోయిందని, ఆర్థికంగా చితికి పోతున్నానని, ఇటువంటి జీవితం వస్తుందని గతంలో ఎన్నడూ ఊహించుకోలేదని 'ఊసరవెల్లి', 'ప్రయాణం' తదితర చిత్రాల్లో నటించిన హీరోయిన్ పాయల్ ఘోష్ వాపోయింది. ప్రస్తుతం ఎవరి జీవితమూ పూల పాన్పులా లేదని, పరిస్థితులు అనుకూలించడం లేదని, తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది.
ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ, ఇళ్లలోనే ఉండి, ప్రాణాలు కాపాడుకోవాలని, ప్రజలంతా బాధ్యతగా ఉంటూ, కలసి పోరాడాల్సిన సమయం ఇదని సలహా ఇచ్చింది. కాగా, 2008లో ఆంగ్ల చిత్రం 'షార్పీస్ పెరిల్'తో పరిచయమైన పాయల్, తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో హీరోయిన్ గా మాత్రమే కాకుండా, కీలక పాత్రలను కూడా పోషించి మెప్పించింది.