ధాన్యం సేకరణ కోసం రూ.30 వేల కోట్లు కేటాయించింది నిజమే అయితే గోనె సంచుల కొరత ఎందుకు వచ్చింది?: ఉత్తమ్
- రైతుల వద్దకే వచ్చి పంటలు కొనుగోలు చేస్తామన్న సీఎం
- ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేయాలన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
- సంక్షోభ సమయంలో రైతును ఆదుకోవాలంటూ విజ్ఞప్తి
పంట కొనుగోళ్ల అంశంపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, రైతు నుంచి ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసేలా హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తద్వారా ఈ సంక్షోభ సమయంలో రైతును ఆదుకోవాలని కోరారు. అంతకుముందు, సీఎం కేసీఆర్ లాక్ డౌన్ అమలు గురించి మాట్లాడుతూ, రైతుల వద్దకే వచ్చి పంటలు కొనుగోలు చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.