సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

Ileana to be cast opposite Pawan Kalyan
  • పవన్ కల్యాణ్ సినిమాలో ఇలియానా?
  • తమిళ దర్శకుడితో ఎన్టీఆర్
  • నాగ చైతన్య కొత్త చిత్రం  
*  గోవా బ్యూటీ ఇలియానా మరోసారి పవన్ కల్యాణ్ తో జతకట్టే సూచనలు కనిపిస్తున్నాయి. వేణుశ్రీరాం దర్శకత్వంలో ప్రస్తుతం పవన్ 'వకీల్ సాబ్' చిత్రాన్ని చేస్తున్నాడు. ఇందులో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుందంటూ నిన్నటివరకు వార్తలొచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం, ఇలియానాను దర్శక నిర్మాతలు సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది.
 *  ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ చిత్రాన్ని చేసే అవకాశం కనిపిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయనున్న చిత్రం తర్వాత తన 31వ చిత్రాన్ని అట్లీ కుమార్ తో చేయడానికి ఎన్టీఆర్ మొగ్గు చూపుతున్నట్టు తాజా సమాచారం.
*  ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' చిత్రాన్ని చేస్తున్న అక్కినేని నాగ చైతన్య తన తదుపరి చిత్రాన్ని ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో చేయనున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.
Go Back to Shorts
Ileana
Pawan Kalyan
Junior NTR
Naga Chaitanya

More Telugu News