'పుష్ప'లో హైలైట్ గా నిలవనున్న రష్మిక పాత్ర
- వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక
- 'పుష్ప'లో గిరిజన యువతి లుక్
- ఆమె పాత్రలో అనూహ్యమైన ట్విస్ట్ అంటూ టాక్
ఇక రష్మిక పాత్ర కూడా పూర్తి భిన్నంగా ఉంటుందని అంటున్నారు. ఒక గిరిజన యువతిగా ఆమె పాత్ర ఎంటరవుతుందని చెబుతున్నారు. కథ పాకాన పడుతుండగా ఆమె పాత్రలో ట్విస్ట్ ఆడియన్స్ కి షాక్ ఇస్తుందని అంటున్నారు. ఇంతవరకూ రష్మిక చేసిన పాత్రలు ఒక ఎత్తు .. ఈ పాత్ర ఒక ఎత్తు అని చెబుతున్నారు. రష్మిక కెరియర్లో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర అవుతుందనే అభిప్రాయలను వ్యక్తం చేస్తున్నారు. చూస్తుంటే ఈ పాత్రతో రష్మిక రేంజ్ మరింత పెరగనున్నట్టే అనిపిస్తోంది.