ప్రకృతి వనరులను కాపాడే 'ఆచార్య'
- ఇటీవలే మొదలైన కొరటాల సినిమా
- లాక్ డౌన్ కారణంగా వాయిదాపడిన షూటింగ్
- ఇది ఓ పొలిటికల్ థ్రిల్లర్ అని చెప్పిన చిరూ
అయితే తాజాగా చిరంజీవి ఓ ఆంగ్ల దినపత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఇది ఒక పొలిటికల్ థ్రిల్లర్ అనీ, ప్రకృతి వనరులను కాపాడుకోవడం కోసం ఒక వ్యక్తి చేసే పోరాటంగా సాగుతుందని చెప్పారు. ఇందులో దేవాలయ భూముల ఆక్రమణకి సంబంధించిన అంశం కూడా వుండే అవకాశం వుంది. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. చిరంజీవి సరసన నాయికగా కాజల్ కనిపించనున్న సంగతి తెలిసిందే.