ప్రభాస్ సినిమా విషయంలో దర్శక నిర్మాతల నిర్ణయం?
- రొమాంటిక్ మూవీ చేస్తున్న ప్రభాస్
- తదుపరి సినిమా నాగ్ అశ్విన్ తో
- ఫిబ్రవరి నుంచి షూటింగ్ చేయాలని నిర్ణయం
'మహానటి'తో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న నాగ్ అశ్విన్, వైజయంతీ మూవీస్ బ్యానర్లో ఒక సినిమాను ప్లాన్ చేశాడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మించడానికి సన్నాహాలు మొదలుపెట్టాడు. ఈ ఏడాది ద్వితీయార్థంలో సెట్స్ పైకి వెళ్లాలని అనుకున్నారు. కానీ లాక్ డౌన్ కారణంగా పనులన్నీ వాయిదా పడ్డాయి. అందువలన ఈ సినిమా రెగ్యులర్ షూటింగును వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మొదలుపెట్టాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చారని తెలుస్తోంది.