ప్రొఫైల్ పిక్ తో కూడా సందేశం ఇస్తున్న ప్రధాని మోదీ!

Modi profile pic creates awareness
  • ఈ ఉదయం జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
  • ఈ సందర్భంగా మెడచుట్టూ స్కార్ఫ్ తో దర్శనమిచ్చిన ప్రధాని
  • అదే స్కార్ఫ్ ను మాస్కుగా ఉపయోగిస్తూ ఫ్రొఫైల్ పిక్
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ జాతినుద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. కరోనాపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్త లాక్ డౌన్ ను మే 3 వరకు పొడిగిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన మెడ చుట్టూ స్కార్ఫ్ వంటి వస్త్రాన్ని ధరించారు. ఇప్పుడదే వస్త్రాన్ని మాస్కుగా చుట్టుకున్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ప్రొఫైల్ పిక్ ను కూడా మార్చేశారు. ముఖానికి ప్రత్యేక వస్త్రం చుట్టుకుని, చేతులు జోడిస్తున్న మోదీని ఆ పిక్ లో చూడొచ్చు. కరోనా నివారణకు మాస్కులు ధరించడం కూడా కీలకమని తన పిక్ ద్వారా ఆయన జాతిని కోరుతున్నట్టుగా భావించవచ్చు.
Go Back to Shorts
Narendra Modi
Scarf
Mask
Profile Pic
Twitter
Corona Virus
India

More Telugu News