ఇద్దరు యువకులను కటకటాల్లోకి నెట్టిన టిక్‌టాక్ వీడియో!
- హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ప్రాంతంలో ఘటన
- మద్యం పోస్తూ టిక్‌టాక్ చేసిన యువకులు
- మంత్రి దృష్టికి వీడియో.. యువకుల అరెస్ట్
అనంతరం ఈ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యాయి. ఇవి కాస్తా ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ దృష్టిలో పడ్డాయి. వెంటనే స్పందించిన ఆయన లాక్‌డౌన్ ఆంక్షలు ఉల్లంఘించడంతోపాటు మద్యాన్ని అక్రమంగా సరఫరా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో యువకులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న సరూర్‌నగర్ ఎక్సైజ్ అధికారులు ఎక్సైజ్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.