'పుష్ప' సినిమా నుంచి తప్పుకున్న విజయ్ సేతుపతి?
- లాక్ డౌన్ కారణంగా జరుగుతున్న ఆలస్యం
- డేట్లు సర్దుబాటు చేయలేని విజయ్ సేతుపతి
- బాబీ సింహాను తీసుకునే ఆలోచనలో సుకుమార్
'పుష్ప' సినిమా షూటింగు అనుకున్న సమయానికి మొదలుకాలేదు. కొన్ని కారణాల వలన ఆలస్యమవుతూ వచ్చింది. లాక్ డౌన్ మరింత ఆలస్యానికి కారణమైంది. అయితే లాక్ డౌన్ తరువాత విజయ్ సేతుపతి డేట్స్ సర్దుబాటు చేసే పరిస్థితి లేదట. ఈ ఒక్క సినిమా చేయాలంటే తమిళంలో ఆయన రెండు మూడు సినిమాలు వదులుకోవలసి వస్తోందట. అందువలన ఆయన 'పుష్ప' నుంచి తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. దాంతో ఆయన స్థానంలో బాబీసింహాను తీసుకోవాలని సుకుమార్ భావిస్తున్నట్టు సమాచారం.