నా మాటలు బాధించి వుంటే క్షమించండి: ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి నారాయణస్వామి
- మర్కజ్ కారణంగానే కరోనా పెరిగిందన్న డిప్యూటీ ముఖ్యమంత్రి
- రక్త పరీక్షలకు ముందుకు రావడం లేదని మండిపాటు
- విమర్శలు రావడంతో ట్విట్టర్ లో క్షమాపణలు
కాగా, మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి కారణంగానే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిందని, వారిలో చాలా మంది వైద్య పరీక్షలకు ముందుకు రావడం లేదని, కావాలనే వారు అలా చేస్తున్నారని తాజాగా, నారాయణస్వామి చేసిన వ్యాఖ్యలను పలువురు ఖండించిన సంగతి తెలిసిందే. నారాయణస్వామి వ్యాఖ్యలు సమాజంలో విద్వేషాలను, మత కల్లోలాలను పెంచేలా ఉన్నాయని మైనారిటీ నేతలు మండిపడ్డారు.