గుజరాత్ సీఎం, కేంద్ర హోంశాఖకు చంద్రబాబు లేఖలు!
- గుజరాత్ లో చిక్కుకుపోయిన 4 వేల మంది జాలర్లు
- ఆదుకోవాలని విన్నవించిన చంద్రబాబు
- ఆహారం, వసతి కల్పించాలని విన్నపం
లాక్ డౌన్ ముగిసేంత వరకు వారికి గుజరాత్ లో ఆహారంతో పాటు వసతి సదుపాయాన్ని కల్పించాలని చంద్రబాబు కోరారు. నిత్యావసరాలను అందించాలని, వైద్య సదుపాయాలను కూడా కల్పించాలని విన్నవించారు. దీంతో పాటు సదరు 4 వేల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న 11 మంది ఫోన్ నంబర్లను లేఖలో పొందుపరిచారు.