పగ తీర్చుకోవడం కోసమే స్మగ్లర్ గా మారే 'పుష్ప'

Pushpa Movie
  • పుష్పక్ నారాయణ్ గా బన్నీ
  • అడవి నేపథ్యంలో సాగే కథ  
  • యాక్షన్ .. ఎమోషన్ కి ప్రాధాన్యత
సుకుమార్ ఇంతకుముందు తెరకెక్కించిన 'నాన్నకు ప్రేమతో' .. 'రంగస్థలం' సినిమాలు రివేంజ్ తీర్చుకునే చిత్రాలుగానే రూపుదిద్దుకున్నాయి. ఇప్పుడు సుకుమార్ సెట్స్ పైకి తీసుకెళ్లనున్న'పుష్ప' కథ కూడా పగ తీర్చుకునే క్రమంలోనే సాగుతుందని సమాచారం. ఎర్రచందనం స్మగ్లర్ల వలన పుష్పక్ నారాయణ్ కుటుంబానికి అన్యాయం జరుగుతుందట.

దాంతో తన కుటుంబానికి అన్యాయం చేసిన స్మగ్లర్ల ఆటకట్టించడం కోసమే పుష్పక్ నారాయణ్ స్మగ్లర్ గా మారతాడనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. యాక్షన్ కి ఒక రేంజ్ లో అవకాశం వుండే కలప అక్రమ రవాణ .. అడవి నేపథ్యం, ఎమోషన్ కి అవకాశం వుండే ఫ్యామిలీ సెంటిమెంట్ తో ఈ కథను సుకుమార్ చాలా ఇంట్రెస్టింగ్ గా అల్లినట్టు తెలుస్తోంది. బన్నీ సరసన రష్మిక కథానాయికగా నటిస్తుండగా, ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి కనిపించనున్నాడు.
Go Back to Shorts
Allu Arjun
Rashmika Mandanna
Sukumar

More Telugu News