లాక్‌డౌన్‌పై వైరల్ అవుతున్న వార్తలను ఖండించిన బోస్టన్ గ్రూప్
- లాక్‌డౌన్ పొడిగించే అవకాశం ఉందన్న బోస్టన్ గ్రూప్
- నిన్నటి మీడియా సమావేశంలో కేసీఆర్ ప్రస్తావన
- తాము ఎటువంటి అధికారిక నివేదిక ఇవ్వలేదన్న బీసీజీ
అంతేకాదు, జూన్ మూడో వారం నాటికి దేశంలో కరోనా వైరస్ మరింత చెలరేగుతుందని, కేసుల సంఖ్య పతాక స్థాయికి చేరుకుంటుందని కూడా బీసీజీ నివేదిక పేర్కొన్నట్టు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. ఈ వార్తలపై తాజాగా బీసీజీ స్పందించింది. లాక్‌డౌన్ పొడిగింపుపై తాము ఎలాంటి అధికారిక నివేదిక ఇవ్వలేదని, ఎవరూ ఆ వార్తలను విశ్వసించవద్దని కోరింది. అయితే, బీసీజీ నివేదికను నిన్నటి మీడియా సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రస్తావించడం విశేషం.