కరోనాపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఆరోగ్యశ్రీ జాబితాలో చేరుస్తూ ఉత్తర్వులు
- ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స అందించాలంటూ ఉత్తర్వులు
- మార్గదర్శకాలు జారీ
- రూ. 16 వేల నుంచి రూ. 2.16 లక్షల వరకు చెల్లింపు
రాష్ట్రంలో కొన్ని రోజుల వరకు స్థిరంగా ఉన్న కేసుల సంఖ్య తబ్లిగీ జమాత్ సదస్సు తర్వాత ఒక్కసారిగా పెరిగింది. ఢిల్లీలో జరిగిన ఈ సదస్సుకు రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల నుంచి ముస్లింలు హాజరయ్యారు. తిరిగి వచ్చిన వారు ఆ వివరాలను దాచిపెట్టడంతో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. నిన్నటి వరకు రాష్ట్రంలో 303 కేసులు నమోదు కాగా, ముగ్గురు మరణించారు. 295 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఐదుగురు కోలుకున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలులో 74 కేసులు నమోదు కాగా, నెల్లూరులో 42, గుంటూరులో 32 నమోదయ్యాయి. అనంతపురంలో అతి తక్కువగా ఆరు కేసులు నమోదయ్యాయి.