Pavan: పవన్ సినిమాలో పూజిత పొన్నాడ ఐటమ్ సాంగ్

Krish Movie
షార్ట్స్‌లో చూడండి
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో ఒక భారీ చారిత్రక చిత్రం రూపొందనుంది. ఆంగ్లేయుల కాలంలో పేదల కోసం దోపిడీలు చేసే పాత్రలో పవన్ కల్యాణ్ కనిపించనున్నాడు. ఇది రాబిన్ హుడ్ తరహాలో సాగుతుందట. ఈ సినిమాలో కథానాయికగా కొంతమంది పేర్లను పరిశీలించారు. జాక్విలిన్ ను ఎంపిక చేశారనేది తాజా సమాచారం.

ఇక ఈ సినిమాలో మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసే ఐటమ్ సాంగ్ ఒకటి ఉందట. ఆ పాట కోసం తెలుగు అమ్మాయి పూజిత పొన్నాడను తీసుకున్నారని తెలుస్తోంది. 'కల్కి' .. 'రంగస్థలం' సినిమాల్లో పూజిత పొన్నాడ సందడి చేసింది. ఆకర్షణీయమైన ఆమె రూపానికి కుర్రకారు ఫిదా అయ్యారు. పవన్ - క్రిష్ సినిమాలో ఆమె చేసే ఐటమ్ సాంగ్ తో మరింత పాప్యులర్ కావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Go Back to Shorts
Pavan
Jacqueline
Pujitha Ponnada

More Telugu News